హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) జాతీయ సమావేశాలు ఆదివారం నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్నట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేశ్ తెలిపారు.
ఆదివారం నుంచి ఈ నెల 7 వరకు జరగనున్న సమావేశాల్లో తెలంగాణ నుంచి 175 మంది టీచర్లు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు, టెట్‌పై తీర్మానాలు చేయనున్నట్టు వెల్లడించారు.