High heels | సాధారణంగా చాలామంది మహిళలు (Women) హై హీల్స్ (High heels) ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. ఎత్తు ఎక్కువగా కనిపించడం కోసం కొందరు, అడుగులు వయ్యారంగా పడటం కోసం మరికొందరు హై హీల్స్పై మోజు పడుతుంటారు.
ఫ్యాషన్ ప్రపంచంలో హై హీల్స్ ఓ రాయల్ సింబల్. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంత నష్టం చేస్తాయో చాలామందికి తెలియదు. నడుము నొప్పితోపాటు మోకాళ్లపై ఒత్తిడి కలగజేస్తాయి.
ఆమె నడిస్తే హంస చిన్నబోవాలి. వయ్యారం అన్న పదం తనకోసమే పుట్టిందని మురిసిపోవాలి. అందమంతా అడుగులకే ఉంటుందన్నది పాదరక్షల తయారీ సంస్థల ఉవాచ. అందుకే ఆడవారి పాదాల మీద ప్రేమను తెలిపేలా రకరకాల డిజైన్లు సృష్టిస్త