ఆమె నడిస్తే హంస చిన్నబోవాలి. వయ్యారం అన్న పదం తనకోసమే పుట్టిందని మురిసిపోవాలి. అందమంతా అడుగులకే ఉంటుందన్నది పాదరక్షల తయారీ సంస్థల ఉవాచ. అందుకే ఆడవారి పాదాల మీద ప్రేమను తెలిపేలా రకరకాల డిజైన్లు సృష్టిస్తున్నాయి. అందులో భాగమే ఈ ‘క్రిస్టల్ హార్ట్ 95 శాటిన్ మ్యూల్స్’.
ఈ పాయింట్ హీల్ చెప్పుల్లో రాళ్లు పొదిగిన హృదయాకారాలు రెండున్నాయి. అందులో ఒకటి ముందుభాగాన్ని అలంకరిస్తే, మరొకటి హీల్ మీద హొయలొలికిస్తున్నది. మాక్ అండ్ మాక్ సంస్థ దీన్ని తయారు చేసింది. నలుపు-తెలుపులో కనువిందు చేస్తున్న ఈ చెప్పులు ముద్దుగుమ్మ కాలికి తోడైతే ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’.. అంటూ ఫాలో కావాల్సిందే!