ఫ్యాషన్ ప్రపంచంలో హై హీల్స్ ఓ రాయల్ సింబల్. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంత నష్టం చేస్తాయో చాలామందికి తెలియదు. నడుము నొప్పితోపాటు మోకాళ్లపై ఒత్తిడి కలగజేస్తాయి. అంతేకాదు వీటిని రెగ్యులర్‌గా ధరిస్తే… కాళ్ల కండరాలు కుంచించుకుపోయే ప్రమాదమూ ఉంది. టీనేజ్‌లో హై హీల్స్ వేసుకొని టిప్‌టాప్‌గా నడిస్తే.. మిడిల్ ఏజ్‌లో రకరకాల సమస్యలు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఎముకల దృఢత్వం తగ్గినప్పుడు ఈ రుగ్మతలు బయటపడతాయట. పాయింటీ హీల్స్ వల్ల ఇంగ్రో నెయిల్స్, ఆర్థరైటిస్ లాంటి ఇబ్బందులు పలకరించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, రోజువారీగా కాకుండా.. ప్రత్యేక సందర్భాల్లో హై హీల్స్ వేసుకోవచ్చు. ఏ పార్టీకో, ఈవెంట్‌కో వీటిని ధరించి షో స్టాపర్‌గా నిలవొచ్చు. మిగతా వేళల్లో..సౌకర్యవంతమైన ఫుట్‌వేర్ ధరించడం మంచిది. స్టయిలిష్‌గా ఉండే మిడ్ హీల్స్ కూడా ప్రయత్నించొచ్చు.