సాధారణంగా హై హీల్స్ వేసుకొని నడవడం అంటే చాలా కష్టం. కొందరు మహిళలు ఫ్యాషన్ కోసం హై హీల్స్ వేసుకుంటారు కానీ.. వాటితో నడవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కానీ.. ఓ మహిళ మాత్రం హై హీల్స్ వేసుకొని తాడు మీద జంప్ చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.
యూఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన ఓగ్లీ హెన్రీ అనే అథ్లెట్ ఈ రికార్డును క్రియేట్ చేసింది. సాంటా మోనికా బీచ్‌లో తను ఈ స్టంట్‌ను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన గిన్నిస్ రికార్డుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు హై హీల్స్ వేసుకొని భలేగా జంప్ చేస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.