వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు.
తెలంగాణకు కృష్ణాజలాల వాటాను తేల్చే వరకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమాన్ని ఆపేదిలేదని మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు.
‘మంత్రి కోమటిరెడ్డికి అహంకారం తలకు ఎక్కి మాట్లాడారు. గతంలో భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క నాడైనా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడలేదు.