యాదగిరిగుట్ట, జనవరి 29 : ‘మంత్రి కోమటిరెడ్డికి అహంకారం తలకు ఎక్కి మాట్లాడారు. గతంలో భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క నాడైనా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడలేదు.
ఈ రోజు మంత్రిగా ఒక మంత్రికి సమాన హోదా కలిగిన వ్యక్తిని అవమాన పరిచారు’ అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘటనను వ్యతిరేకించాలని కోరారు.