జెన్-జీ తరం.. విభిన్నంగా ఆలోచిస్తుంది. టెక్నాలజీ విషయంలోనే కాదు.. ‘ఫ్యాషన్'ను ఫాలో కావడంలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నది. కంటికి నచ్చినవి కొంటున్నది. ఎంత నచ్చజెప్పినా.. నచ్చనివాటిని పక్కన పెట్టేస్తున్నది.
దేశంలోని అత్యుత్తమ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సంతోషి షెట్టి ఒకరు. తను ఫ్యాషన్ బ్లాగర్ కూడా. చదివింది ఆర్కిటెక్చర్ అయినా.. రంగుల ప్రపంచం మీద మనసు పారేసుకుంది.
అరచేత ఒదిగిన మెహందీ అందమైన వర్ణాన్ని పూయించడమే కాదు, అచ్చంగా ఆ పొడి రంగు కూడా సుందరంగానే కనిపిస్తుంది. పెసరపొట్టు వన్నెకూ, ఆకుపచ్చకూ మధ్యస్తంగా ఉండే ఈ చిత్రమైన వర్ణపు డ్రెస్లో ముచ్చటగా వెలిగిపోతున్నది