దేశంలోని అత్యుత్తమ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సంతోషి షెట్టి ఒకరు. తను ఫ్యాషన్ బ్లాగర్ కూడా. చదివింది ఆర్కిటెక్చర్ అయినా.. రంగుల ప్రపంచం మీద మనసు పారేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన ట్రావెల్ స్టోరీస్‌కు భలే గిరాకీ ఉంది.
పోస్టు చేయడమే ఆలస్యం, ఫాస్ట్‌గా చదివేస్తారు. ఈ ముంబై ముద్దుగుమ్మ బ్రాండ్ ప్రమోషన్లకు లక్షల్లో తీసుకుంటుందని వినికిడి.