చిత్రమైన వర్ణాల మేళవింపుతో, అచ్చెరువొందించే ప్రింట్ల సమాహారంగా కనిపిస్తున్నది కదూ ఈ లెహెంగా సెట్. హైదరాబాదీ డిజైనర్ ఐషా రావ్ దీన్ని రూపొందించారు. తాను ఫ్యాషన్ పట్టా పుచ్చుకున్న స్పెయిన్‌లోని బార్సిలోనా నగర స్ఫూర్తితో కొత్త కలెక్షన్ తీసుకొచ్చారామె.
అక్కడి కట్టడాలు, కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా వీటిని తీర్చిదిద్దారు. జిగ్సా పజిల్లా కనిపించే ఆప్లిక్ వర్క్‌తో ఈ లెహెంగాను డిజైన్ చేశారు. తనకిష్టమైన బార్సిలోనాకు ఈ కలెక్షన్ ప్రేమలేఖ లాంటిదని అంటారు ఐషా.