ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోర్సు అభ్యసిస్తున్న ఇద్దరు మైనర్లను నమ్మించి గదికి తీసుకెళ్లిన ఇద్దరు యువకులు వారికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వెంగళరావునగర్, నవంబర్ 3: ఎయిర్ హోస్టెస్ శిక్షణ కోర్సు అభ్యసిస్తున్న ఇద్దరు మైనర్లను నమ్మించి గదికి
తీసుకెళ్లిన ఇద్దరు యువకులు వారికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..నిజామాబాద్ జిల్లాకు చెందిన
గణేశ్ డిగ్రీ పూర్తి చేసుకుని నగరంలోని బోయిన్‌పల్లిలో నివాసం ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
బాలానగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తరుణ్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవాడే. వీరిద్దరూ స్నేహితులు. ఇదే జిల్లాకు చెందిన 17 ఏండ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసుకుని ఎయిర్‌హోస్టెస్ శిక్షణ కోసం నగరంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఒక లేడీస్ హాస్టల్ లో ఉంటూ ఓ ఏవియేషన్ సంస్థలో శిక్షణ పొందుతోంది. దమ్మాయిగుడకు చెందిన మరో 17 ఏండ్ల బాలిక కూడా ఇదే యువతితో కలిసి లేడీస్ హాస్టల్ లో ఉంటూ ఏయిర్హోస్టెస్ శిక్షణ తీసుకుంటోంది.
ఈ క్రమంలో గణేశ్‌కు నిజామాబాద్ జిల్లాకు చెందిన బాలికతో గతంలోనే పరిచయం ఉంది. వీరిద్దరూ ఒకే కళాశాలలో చదువుకోవడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. గణేశ్,తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలానగర్ లో పార్టీ ఉందంటూ ఇద్దరు బాలికలను నమ్మించి కారులో తరుణ్ గదికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు బాలికల పై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలికల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

