ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రవాణా సదుపాయం మెరుగవడం లేదు. ఓవైపు నగర విస్తృతి పెరుగుతున్నా అందుకు తగిన విధంగా రవాణా ఏర్పాట్లను కల్పించడంలో ఆర్టీసీ వెనకబడుతోంది.
- ఛార్జింగ్ స్టేషన్లలోనే ఈవీ బస్సులు
- నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆలస్యం అవుతున్న రాకపోకలు
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రవాణా
సదుపాయం మెరుగవడం లేదు. ఓవైపు నగర విస్తృతి పెరుగుతున్నా అందుకు తగిన విధంగా రవాణా
ఏర్పాట్లను కల్పించడంలో ఆర్టీసీ వెనకబడుతోంది. నగరంలో 3200 బస్సులున్నా ఇందులో 325 ఎలక్ట్రిక్
బస్సులను ఆర్టీసీ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చాలా బస్సులు పీక్
సమయాల్లో ఛార్జింగ్ స్టేషన్లకే పరిమితమవుతున్నాయి.
ఛార్జింగ్ స్టేషన్లలో బస్సులు తమవంతు వచ్చే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అందులోనూ కొన్ని ఛార్జింగ్ స్టేషన్లలో నిర్వహణ సరిగా లేకపోవడంతో గంటల తరబడి అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. మరికొన్ని సాంకేతిక సమస్యలతో నిర్వహణ మరమ్మతులో ఉంటున్నాయి. సాధారణంగా ఒక బస్సు ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 240 కిలో మీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ అది క్షేత్రస్థాయిలో అన్ని కిలోమీటర్ల రావడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు.
అయితే వాస్తవ ప్రయాణ దూరం బస్సు బరువు, ప్రయాణికుల సంఖ్య, ఏసీ వినియోగం, రహదారి పరిస్థితులు, బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బస్సుల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇటీవల హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. బేగంపేటలో ఇటీవల ఓ ఎలక్ట్రిక్ బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈవీ బస్సుల నిర్వహణ విషయంలో హడావుడి కార్యకలాపాలు భద్రతాపరంగా సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత డీజిల్ బస్సులను కొత్త ఈవీలుగా మార్చేందుకు రెట్రోఫిట్ ప్రక్రియను ఆర్టీసీ చేపట్టడంపై ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తుతుంది. అందులో భాగంగా 240 డీజిల్ బస్సులను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో రెండు బస్సులు ఇప్పటికే ఆర్టీఏ అనుమతి పొంది రోడ్డెక్కాయి. మిగిలిన బస్సులు దశలవారీగా రానున్నాయి. అయితే ఈ తరహా ఈవీ బస్సులపై ప్రత్యేక పర్యవేక్షణ లేకపోతే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాత బస్సులు..ఎలక్ట్రిక్ మోటర్లతో..
కొత్త బస్సుల కొనుగోలుతో అయ్యే ఖర్చును తగ్గించడంతో పాటు, ఇప్పటికే అందుబాటులో ఉన్న బస్సుల
జీవిత కాలాన్ని మరింత ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రెట్రోఫిట్ విధానాన్ని ఆర్టీసీ
వినియోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత 240 డీజిల్ బస్సుల్లో 200 బస్సుల రెట్రోఫిట్
బాధ్యతను పలు సంస్థలకు అప్పగించారు. ఈ విధానంలో బస్సు బాడీ, చాసిస్ ను ఉపయోగించుకుంటూ
డీజిల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీలు, కంట్రోలింగ్ వ్యవస్థను అమర్చుతారు. దీంతో పాత
బస్సు ఎలక్ట్రిక్ వాహనంగా మారుతుంది. మియాపూర్, ఉప్పల్ ఆర్టీసీ యూనిట్లలో రెట్రోఫిట్ పనులు
ముమ్మరం చేశారు. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్
బస్సుగా మార్చిన విషయం తెలిసిందే.
ఆ బస్సును ఉప్పల్ డిపో పరిధిలో నడుస్తుండటంతో అదే తరహాలో ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రక్రియలో పాత బస్సుల చాసిస్ లు బ్యాటరీల అదనపు బరువును ఎంతవరకు తట్టుకోగలవు అనేది తేలాల్సి ఉంది. కాగా 2027 నాటికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సవాళ్లు ఎదురవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కాకుండా ప్రమాదాలు జరగని సాంకేతికత వ్యవస్థతో వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. నగరంలో రాకపోకలు సాగించే ఈవీ బస్సులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాని పర్యవసనం పెద్దగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

