రాష్ర్టానికి అవసరమైన విద్యావిధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు తరహాలో కొత్తగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించనున్నది.
డిగ్రీ కోర్సుల్లో ‘బకెట్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవలే బకెట్ సిస్టంను రద్దుచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించగా, ఈ ప్రతిపాదనలను సర్కారు తిరస్కరించింది.