హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి అవసరమైన విద్యావిధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు తరహాలో కొత్తగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించనున్నది. ఏడుగురితో కమిటీని ఏర్పా టు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సోమవారం ఉత్తర్వు లు జారీచేశారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఎమ్మెల్యే డాక్టర్ కడియం శ్రీహరి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సీఎస్ కే రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఒక నిపుణుడు (చైర్మన్కు నిర్ణయాధికారం) సభ్యులుగా ఉండనుండగా, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై అధ్యయనం చేసి అక్టోబర్ 30లోపు నివేదిక సమర్పించాలని సూచించారు.
సర్కారు బడులకు గురుకుల టచ్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులకు విద్యాశాఖ అధికారులు గు రుకుల టచ్ ఇస్తున్నారు. గురుకులాల తరహాలో సంస్కరణల బాట పట్టిస్తున్నారు. గురుకులాల్లో గల ప్రత్యేక వసతులను బడుల్లోనూ కల్పిస్తున్నారు. వెయ్యి సర్కారు బడుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. బాల బాలికలకు ఈశిక్షణ ఇస్తా రు. మరో వెయ్యి సర్కారు బడుల్లో స్కూల్ బ్యాండ్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సర్కారు పచ్చ జెండా ఊపింది. మరో 93 కేజీబీవీలను సెంటర్ అఫ్ ఎక్సలెన్సీ(సీవోఈ)గా అప్గ్రేడ్ చేసేందుకు సైతం సర్కారు ఆమోదం తెలిపింది. ఈ సీవోఈల్లో ఎప్సెట్, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను సీవోఈలుగా తీర్చిదిద్దుతారు. ఈ విద్యాసంవత్సరం వీటి పనితీరును పరిశీలించి, ఆ తర్వాత దశలవారీగా విస్తరిస్తారు.