క్రిస్మస్ కానుకలొచ్చాయ్.. రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన 19,500 మంది నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 36 చోట్ల క్రిస్మస్ విందులకూ ప్రభుత్వం రూ.39 లక్షలను కేటాయించింది.
అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ప్యాక్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.