Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం భ్రమరాంబికా దేవి బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు మల్లిఖార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు ఊరేగారు.
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.