అయోధ్య రాముడి పూజిత అక్షింతలను జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది.