సిద్దిపేట టౌన్, జనవరి 21 : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. ధర్మకార్య ఉత్సవ సమితి, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని మోహినీపురా వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీరామచంద్రస్వామి విగ్రహ శోభాయాత్ర నిర్వహించారు.