ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం చొప్పున విధులు నిర్వహిస్తారు.
విద్యార్థి దశలో కీలకమైన మలుపు పదో తరగతి. అలాంటి పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి(డీటీడబ్ల్యూవో) కోటాజీ అన్నారు.