హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం చొప్పున విధులు నిర్వహిస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రభు త్వం ఇలాంటి పలు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీ క్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 4,94,620 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యా హ్నం 12:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనుండగా, కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్లకు మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకే జరుగుతాయి. హాల్‌టికెట్లను www.bse.telangana. gov. in వెబ్సైట్లో పొందుపరిచారు. పరీక్షల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
‘పది’ పరీక్షలకు 12 మంది అబ్జర్వర్లు
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పేపర్ లీకేజీల పుకార్లపై వాస్తవాలు తేల్చడం, రెవెన్యూ, పోలీసు శాఖలను అప్రమత్తం చేయడం కోసం 12 మంది ఉన్నతాధికారులను అబ్జర్వర్లుగా నియమించింది. అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులనూ వివిధ జిల్లాలకు అబ్జర్వర్లుగా నియమించారు. వీరు రెండు రోజుల ముందుగానే తమకు కేటాయించిన జిల్లాలకు చేరుకొని సమన్వయం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
హాల్‌టికెట్లపై హెచ్ఎం సంతకం తప్పనిసరి చేయండి
పదో తరగతి హాల్‌టికెట్లపై హెచ్ఎంల సంతకం తప్పనిసరి చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు వై శేఖర్‌రావు, ఎస్ మధుసూదన్, కోశాధికారి ఐవీ రమణారావు శనివారం ఒక ప్రటకన విడుదల చేశారు. సంతకంలేకుండా పరీక్షలకు అనుమతించడంతో ఫొటోలను మార్చి ఒకరికి బదులుగా మరోకరు పరీక్షలకు హాజరయ్యే అవకాశముంటుందని అన్నారు.
05