ATS Centre | కోదాడలో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ (ఏటిఎస్) ఏర్పాటుకు కృషి చేస్తామని పలువురు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో సూర్యాపేట ఆర్టీవోగా పనిచేసే వరంగల్‌కు డీటీసీగా పదోన్నతిపై వెళ్తున్న సురేష్ రెడ్డికి కోదాడ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.
కోదాడలో పనిచేయడం తమ పూర్వజన్మ సుకృతమని ఇక్కడి ప్రజలందరి ఆదరాభిమానాలు మరిచిపోలేనివి అన్నారు. రవాణారంగం దేశానికి వెన్నుముక లాంటిదని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వ్యాపారంలో నష్టం వచ్చినా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో లారీ యజమానులు సొసైటీకి సర్వీస్ చేస్తున్నారని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న లారీ యజమానులకు చట్ట పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో లారీ డ్రైవర్ల తప్పులేకున్నా శిక్ష పడుతుందని రానున్న రోజుల్లో ప్రమాదాల్లో ఎవరి తప్పు ఉంటే వారికే శిక్ష పడేవిధంగా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీవో రవాణా శాఖ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ డీటీసీ వాణి, కామారెడ్డి డీటీఓ శ్రీనివాసరెడ్డి, ఆర్టీవో రవికుమార్, సూర్యాపేట డీటీవో జయప్రకాష్, రిటైర్డ్ ఎంవిఐ సుభాష్, ఎంవిఐలు జిలాని, శ్రీనివాస్, కొండయ్య, కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తూనం కృష్ణ, రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, సెక్రటరీ యలమందల నరసయ్య, రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఆవుల రామారావు, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు పైడిమర్రి వెంకటనారాయణ, కోదాడ మాజీ అధ్యక్షుడు కనగల నాగేశ్వరరావు, విలాసకవీ నరసరాజు, పెద్ది అంజయ్య, దొంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన