తుంగతుర్తి, నవంబర్ 24 : దేశంలోనే దళిత బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పించన్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని బండరామారం గ్రామ పంచాయతీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత మిషన్ భగీరథ ట్యాంక్‌ను, రూ.25లక్షలతో ఏర్పాటు చేసిన వైకుంఠధామం, పార్కులను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. అవకాశాన్ని వినియోగించుకుని గ్రామాలు సుసంపన్నం కావాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. బండ రామారం నుంచి గుండెపురికి వెళ్లే బీటీ రోడ్డు మరమ్మతుకు తక్షణమే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి ఈ దఫాలో 500 దళిత బంధు యూనిట్లు రానున్నట్లు తెలిపారు. స్థలమున్న ప్రతి ఒక్కరూ రూ.3 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి నియోజకవర్గానికి 100 ఇండ్లు రానున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నంటి ఉండాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో తాసీల్దార్ రాంప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ ప్రణీతాజయచంద్రారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, గడ్డం ఉప్పలయ్య, ఆకారపు సైదులు, గుండగాని రాములు, కటకం వెంకటేశ్వర్లు, పులుసు యాదగిరిగౌడ్, గోపగాని రమేశ్‌గౌడ్, శ్రీను, పులుసు వెంకటనారాయణ, తునికి సాయిలు, లక్ష్మి, గునగంటి సంతోష్ పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మద్దిరాల : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పెద్ద చెరువు, కొత్త చెరువులో జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్రావుతో కలిసి సమీకృత మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను అందిస్తుంటే మత్స్య సొసైటీలు అప్పుల ఊబినుంచి బయటపడడం జరుగుతున్నదన్నారు. కాళేశ్వరం జలాలతో చెరువులు నింపడం ద్వారా ఇటు రైతులకు అటు మత్స్యకారులకు ఎంతో ఉపయోగం జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాసీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీడీఓ సరోజ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, మత్స్యశాఖ జిల్లా అధికారి రూపేందర్‌సింగ్, సర్పంచ్ షేక్ ఇంతియాజ్జ్రాక్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, సొసైటీ చైర్మన్ బాషబోయిన చంద్రయ్య, బీఎస్ ముదిరాజ్, మత్స్య సోసైటీ సభ్యులు, శాఖ అధికారులు పాల్గొన్నారు.
పలువురికి పరామర్శ
మండలంలోని జి కొత్తపల్లి గ్రామానికి చెందిన జిల్లా నాయకుడు కన్న వీరన్నగౌడ్ తండ్రి మల్లయ్య వారం రోజుల క్రితం మరణించడంతో మల్లయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే కుంటపల్లి గ్రామంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు గోల్కొండ మల్లేశ్ తండ్రి వెంకన్న మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.