e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, April 15, 2021
Advertisement
Home సూర్యాపేట కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటనారాయణగౌడ్
సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 8 : కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆయన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుని మాట్లాడారు. 40 ఏండ్లుపైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, గూడూరి సూర్యప్రకాశ్‌, సిబ్బంది ఉన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి : ఎంపీపీ
ఆత్మకూర్‌.ఎస్‌, ఏప్రిల్‌ 8 : ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలంలో కొవిడ్‌ను నివారించేందుకు అధిక టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్‌ ఆనంద్‌, ఎంపీఓ సంజీవయ్య, ఎంఈఓ ధారాసింగ్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) ఏప్రిల్‌ 8 : కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీపీ గుండగాని కవిత సూచించారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుల సమావేశంలో వారు మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఫంక్షన్‌హాళ్లలో 50 మందిలోపు కార్యక్రమం చేసుకోవాలని, ఇందుకోసం తాసీల్దార్‌ అనుమతి తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ లక్ష్మి, డాక్టర్‌ నాగునాయక్‌, ఏపీఓ వెంకన్న, ఏఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

టీకాలు వేయించుకోవాలి : ఎంపీపీ
నాగారం, ఏప్రిల్‌ 8 : కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని ఎంపీపీ కూరం మణీవెంకన్న అన్నారు. కొవిడ్‌-19పై మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 40సంవత్సరాలు నిండిన వారు టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పాజిటివ్‌ వచ్చి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య ఆరోగ్యశాఖ సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి కిరణ్‌కుమార్‌, ఎంపీడీఓ గాలి శోభారాణి, మండల వైద్యాధికారి రామకృష్ణ, ఎంఈఓ బాలూనాయక్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అనీఫా, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్య, ప్రవీణ్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

టీకా వేయించుకోవాలి
చివెంల, ఏప్రిల్‌ 8 :45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలని మండల వైద్యాధికారి బి.శ్రీనివాసరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. .

ఇవీ కూడా చదవండీ…

తెలంగాణకు నాబార్డు దన్ను

చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి

కొత్తారు..కారుదే జోరు..

Advertisement
కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement