తుంగతుర్తి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు స్కూటీలు, ల్యాప్టాప్లు, ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి (Thungathurthy) మండల కేంద్రంలో విద్యార్థులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిస్తున్న కూడా ఇంతవరకు మాకు ఇస్తానన్న హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు . ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గోపగాని శ్రీనివాస్ తడకమళ్ల రవికుమార్, మల్లేషబొజ్జ సాయి కిరణ్, ఉప్పుల నాగమల్లు, గోపగాని వెంకన్న, రాంబాబు, విద్యార్థినులు మల్లెపాక శృతి, వర్ష, కీర్తన, కావ్య తదితరులు పాల్గొన్నారు.