Science Fair | విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా సైన్స్ ఫెయిర్
Science Fair | జయ పాఠశాలలో ఇవాళ సైన్స్ ఫెయిర్‌ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్టోరియల్ అధికారి జనార్ధన్ పాల్గొన్నారు.
Science Fair | సూర్యాపేట అర్బన్, మార్చి 2 : జయ పాఠశాలలో ఇవాళ సైన్స్ ఫెయిర్‌ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్టోరియల్ అధికారి జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జయ సృష్టిని ప్రతీ సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని అన్నారు.
సైన్స్ ఫెయిర్‌లో భాగంగా విద్యార్థులు సంస్కృతి, సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు, భయకంపితులను చేసిన డెవిల్ హౌస్, హైడ్రాలిక్ మిషన్స్, పీఎస్ఎల్వీసీ 33, 37 నమూనాలు, నానోట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ కంట్రోల్డ్ బైరిమోట్, ఫుడ్ కోర్టు, స్పేసూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెడికల్ క్యాంప్‌లో తల్లి దండ్రులు తమ వైధ్య పరీక్షలు చేయించుకొని.. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి ఎంతో ఆనందించారు. వాటితో పాటు ప్రదర్శనలో విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలలోని వివిధ అంశాలను ప్రయోగాల రూపంలో వివరించారు. భౌతిక, రసాయన, సాంఘీక శాస్త్ర, జీవశాస్త్రాలలోని విషయాల అనువర్తనాలను సులువుగా అర్థం అయ్యేలా తమ ప్రయోగాలతో వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా. పద్మ, బింగి, జ్యోతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Read Also :
Karakkaya | అనేక వ్యాధులను తగ్గించే కరక్కాయ.. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..?
Manchyryala | హమాలీ కుటుంబానికి అండగా నిలిచిన సంఘం సభ్యులు
Ambedkar Ground | ఎవరి కోసం చూడకుండా.. అంబేద్కర్ గ్రౌండ్‌ను శుభ్రం చేసిన విద్యార్థులు
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

