సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర సాధకుడు , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు( SIT notice ) ఇచ్చిందని ఆరోపిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ( Effigy ) దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్కు, కేసీఆర్కు ఫోన్ టాపింగ్ కేసులో సీట్ నోటీసులు పంపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మట్టిపెల్లి శ్రీశైలం, దొంగరి శ్రీనివాస్, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, మనోజ్, రమేష్, కర్ణాకర్ , మండల నాయకులు మల్యాల రాములు, గుడిపాటి వీరయ్య, కడారి దాసు, గోపగాని రమేష్, మట్టిపెల్లి వెంకట్, సోమేశ్, యాకూబ్, గునిగంటి యాదగిరి, తునికి లక్ష్మి, గోపగాని శ్రీనివాస్, బొజ్జ సాయికిరణ్ వెంకటేష్ , మల్లేష్, భాస్కర్, మహేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.