Jagadish Reddy | సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీనే ప్రజల శత్రువు..అభివృద్ధి కావాలన్నా..అరాచకాలు కావాలన్నా.. మోసకారి కాంగ్రెస్‌ను ఓడించండి.. అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మద్దతివ్వండి..ఇదే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల స్లోగన్.. అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014కు ముందు ఎట్లున్నదో.. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన అట్లనే ఉన్నది.. అరాచకాలు, కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెరిగినయ్.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయిండ్రు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల్లో హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు.. మోసకారి కాంగ్రెస్‌ను ఓడగొట్టాలనే ప్రజలు కంకణ బద్దులై ఉన్నారు.. సంక్రాతి కంటే ముందే పట్టణాల్లో పండుగ వాతావరణం మొదలైంది.. కారు గుర్తు కనబడితే చాలు ఓటేసేందుకు అంతా సిద్దమంటున్నారని చెప్పారు.
చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యం..
కేసీఆర్ రుణం తీర్చుకోవాలనే తపన ప్రజల్లో కనబడుతుంది.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని జగదీష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, రేవంత్‌వి చీకటి ఒప్పందాలు.. తమ రాజకీయ అవసరాల కొరకే అమ్ముడుపోతున్నాడు. కృష్ణా, గోదారి జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నరు.. బణకచర్ల పేరుమార్చి.. నల్లమల్ల సాగర్ అంటున్నారు. దానికి ఏ పేరు పెట్టినా జరిగేది తెలంగాణ నీళ్ల దోపిడే.. చంద్రబాబును సంతృప్తి పరచడమే రేవంత్ లక్ష్యం.. రాజకీయ అవసరాల కొరకే మన నీళ్లను దోచి పెడుతున్నారు.. మొదటి నుంచి కూడా తెలంగాణకు జాతీయ పార్టీలే శత్రువులు.. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే తప్ప స్పందించరా..? కేసీఆర్, కేటీఆర్‌పైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది వాళ్లు కాదా..? ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాయించినప్పుడు సోయిలేదా..? ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే బాదైతుందా..? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదటి నుంచి ఆరోపణలపై చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు.
కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వచ్చినయని పై స్థాయి అధికారులు స్పందిస్తున్నారు.. కేసీఆర్ పాలనలో పదేండ్లు ఇటువంటి ఘటనలు జరిగినయా..? గాంధీ భవన్, సీఎం ఆఫీస్ నుంచి గోస్ట్ సైట్లు పని చేస్తున్నయి.. వాటినుంచే ఇటువంటి వార్తలు వస్తున్నాయి..ముందు వాటిని బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది.. రాజకీయాల్లో విలువలు పాటించాలి.. తప్పుడు రాతలు ఎవరిపై వచ్చినా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు జగదీష్ రెడ్డి.
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం