పెన్పహాడ్, నవంబర్ 24 : పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు తన సంచిలో గంజాయిని గత వారం రోజుల క్రితం విశాఖపట్టణం దగ్గర సీలేరులో కొనుగోలు చేసి తన ఇంట్లో దాచాడు. సోమవారం తన చదువు కోసం కోదాడకు వెళ్తుండగా మాచారం గ్రామం వద్ద పోలీస్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉండగా అతడిని చెక్ చేయగా 1 కేజీ 400 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.