Nallagonda Depot | నల్గొండ ఎక్సైజ్ డిపోలో మద్యం కాటన్ లోడింగ్‌లో ఇతర జిల్లాలలో ఎక్కడా లేనట్టుగా రేట్ల పెంచేందుకు నిర్ణయం తీసుకొని 5వ తేదీ వరకు తేల్చాలని అల్టిమేటం ఇవ్వడం దారుణమని. ఇక వారి ఆధిపత్యం చెల్లదని నల్గొండ ఎక్సైజ్ డిపో పరిధి వైన్ షాపుల యాజమాన్యాల సంఘ అధ్యక్షులు చేర్యాల వెంకటాచారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..
ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని సీతారామ ఫంక్షన్లో సదరు యజమానులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిపోలో లోడింగ్ చేసే హమాలీలలోని 156 మందిలో సగం మందికిపైగా నకిలీ కార్డు దారులేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎక్సైజ్ అధికారులు నిజ నిర్ధారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వరంగల్ జిల్లాలలో కాటన్ కు 6 రూపాయలు ఉండగా.. ఇక్కడ 9 రూపాయల 50 పైసలు ఇస్తున్నామని ఇక అంతకంటే పెంచాలని అల్టిమేట్ ఇవ్వడం శోచనీయమన్నారు. హమాలీ కార్డు రేటు రూ.50 లక్షలు పలుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు.
500 మంది యజమానులతో ఆందోళన చేసేందుకు సిద్ధం..
ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ చేయాలన్నారు. దీంతోపాటు రేట్లు పెంచకపోవడంతో పని గట్టుకుని డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వారి ఆగడాల నివసిస్తూ 5న డిపో ఎదుట అమీ తుమీ తేల్చుకునేందుకు 500 మంది యజమానులతో ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా ఉందని ఈ వ్యాపారాన్ని వృత్తిగా మార్చుకోవటం వల్ల లక్షలాది రూపాయలు వెచ్చించి వైన్ షాపులు నడుపుతున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రవాణా ఖర్చులు పెరుగుతున్నందున నల్లగొండ డిపోను సూర్యాపేటకు మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలపై త్వరలో జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఎక్సైజ్ లేబర్ కమిషనర్లను కలిసి తమ గోడును వినిపించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోమని కోరుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజులు షాపులు మూసివేసైనా హమాలీల ఆధిపత్యానికి తలొగ్గేదే లేదని చావో రేవో తేల్చుకుంటామన్నారు.
ఈ సమావేశాల్లో సంఘ నాయకులు సత్యనారాయణ రెడ్డి సైదిరెడ్డి వెంకటరెడ్డి రుక్మారావు విటల్ రెడ్డి కంది బండ సత్యనారాయణ వైన్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!