పెన్ పహాడ్, జూలై 07: మొహర్రం పండుగ పురస్కరించుకొని మండలంలోని అనంతారం, పెన్ పహాడ్, పోట్ల పహాడ్, చిదేళ్ల, అనాజిపురం గ్రామాల్లో పీరీల ఊరేగింపులతో గ్రామాల్లో సందడి నెలకొంది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఆయా గ్రామాల్లో పీరీల ఊరేగింపు ప్రారంభించి ఇంటింటికి సందర్శన చేస్తుండగా.. భక్తులు పిరిలకు దట్టీలు, కుడకల పేరులు, కట్న కానుకలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిభక్తి శ్రద్ధలతో తమ మెక్కులు తీర్చుకుంటున్నారు.
హిందూ ముస్లింలు ఒక్కటిగా జరుపుకునే పీరీల పండుగ వైభవంగా జరుగుతుండగా ఇదే రోజు రాత్రి పీరీల నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి అని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ మస్తాన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కుల,మతాల ఐకమత్యమే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శమని రాచరిక వ్యవస్థ పునరుద్ధనoగా భావించిన మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమామ్ హుస్సేన్ ప్రజలను చైతన్య వంతులను చేసి ప్రకటించడానికి సిద్ధపడ్డారని ఆయన గుర్తు చేశారు.