సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈసందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఎస్ఎన్సీయూ నవజాత శిశు చికిత్సా కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, వైద్య ఆరోగ్యశాక కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.