హుజూర్ నగర్, జూన్ 12 : ఈనెల 14 న స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంలో జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు కృషి చేయాలని ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి భవ్య న్యాయవాదులను కోరారు. కోర్టు ప్రాంగణంలో గురువారం ఆమె న్యాయవాదులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా న్యాయవాదులు కృషి చేయాలని ఆమె కోరారు. న్యాయస్థానాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కక్షిదారులను చైతన్యపరిచి వారిలో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడే విధంగా న్యాయవాదులు, పోలీసులు కృషి చేయాలన్నారు.
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునే విధంగా కక్షిదారులను న్యాయవాదులు చైతన్య పరచాలన్నారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోట్లు, భూవివాదాలు, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాద పరిహార తదితర అన్ని కేసులను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, జుట్టుకొండ సంధ్య, షేక్ లతీఫ్, గొట్టే ప్రశాంత్, నాగేందర్ నాయక్, మంత్రి పగడ నరసింహారావు, కొట్టు సురేష్, పెండెం సాయిరాం, పాలేటి శ్రీనివాసరావు, వెంకటేష్ నాయక్, కమతం నాగార్జున, రమణారెడ్డి, వట్టికూటి అంజయ్య, శ్రీను నాయక్, రామినేని వెంకటేష్, ఎం ఎస్ రాఘవరావు, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.