Minster Uttam Kumar Reddy | విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పబ్లిక్ కప్ ఆవరణలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను ఇవాళ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని.. వారంతా నా కుటుంబ సభ్యులైన అని వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తానని భారీ భరోసా ఇచ్చారు.
విశ్రాంత ఉద్యోగుల కోరికలు న్యాయమైనవని.. తప్పక పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఎటువంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా అన్ని శాఖల్లో పదోన్నతులు బదిలీలు చేస్తున్నామన్నారు.మూడు దశాబ్దాల నుండి కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలలో ప్రజలు తనను గుండెల్లో స్థానం కల్పించారని. వారికి రుణపడి ఉన్నానన్నారు.. హెల్త్ కార్డులు మంజూరు చేయిస్తానన్నారు. దీంతోపాటు సంఘ భవనానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. 60 సంవత్సరాలు దాటినప్పటికీ నూతన ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనటం హర్షణీయమన్నారు.
మరో ముఖ్య అతిథి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే తొలిసారి ఇక్కడ పోటీలు నిర్వహించటం హర్షణీయమన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవలో ముందుండాలని… యువత సామాజిక రుగ్మతలకు గురి కాకుండా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు సీతారామయ్య నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం పట్ల అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, సంఘ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు సుదర్శన్, సంఘ నాయకులు మేనేపల్లి శ్రీనివాస్ , బొల్లు రాంబాబు, బాధ్యులు సుధాకర్ దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్ పట్టాభి రెడ్డి, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
Kodada
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు