సూర్యాపేట : సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ( Food Poison ) కు గురై 13 మంది విద్యార్థినులు( Students ) అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గత కొద్దిరోజులుగా విషజ్వరాలతో బాధపడుతూ విద్యార్థినులు హాస్టల్‌ను వదిలి వెళ్తున్నా కాని సిబ్బంది పట్టించుకోవడం లేదని సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నాణ్యమైన భోజనం కూడా అందించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్త చేశారు.