Collector Tejas Nandlal Pawar | చివ్వేంల, మార్చి 04 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ఇవాళ ఐలాపురంలోని చివ్వేంల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వంట గదిని సందర్శించి.. స్టాక్ రిజిస్టర్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థినిలకు భోజనం వడ్డీంచాలని సిబ్బందికి సూచించారు.
స్టాప్ హాజరు పట్టికని పరిశీలించి ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యార్థినిలతో మాట్లాడుతూ.. బుధవారం నుండి జరగబోయే వార్షిక పరీక్షలలో భయపడకుండా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. మెను ప్రకారం భోజనం వడ్డీస్తున్నారా..? అని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు.
పదవతరగతి పరీక్షలలో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారిని ప్రోత్సహించి జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గాభవాని, వైస్ ప్రిన్సిపాల్స్ షభానా, కావ్య, వార్డెన్ లలిత, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు