తిరుమలగిరి, అక్టోబర్ 17 : బూత్ స్థాయిలో అందరూ సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల బూత్ స్థాయి ఇన్చార్జీల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ శాఖలు, అనుబంధ సంఘాలు, వంద మంది ఓటర్లకు ఒక బూత్ ఇన్‌చార్జీగా ఉండి పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
నియోజక వర్గంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు వివరించాలన్నారు. గతంలో నియోజక వర్గం అన్ని రంగాల్లో వెకబడిందని నేడు అభివృద్ధితో నియోజక వర్గం రూపు రేఖలు మారాయన్నారు. తుంగతుర్తి నియోజక వర్గంలో బీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగేంధర్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా, మండలాల ప్రజా ప్రతినిధులు, బూత్ ఇన్చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ అన్నారు. తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పోలోజు మహేంద్రాచారితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల వీరయ్య, ఎంపీటీసీ పొన్నం వెంకన్న, కో ఆష్షన్ సభ్యులు మౌలాన, సురేశ్, నాగరాజు, కరుణాకర్ పాల్గొన్నారు.
తుంగతుర్తిలో గులాబీ జెండా ఎగురవేయాలి..
తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలుపుతో గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉన్నదన్నారు. నియోజక వర్గంలో రూ.3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో దళిత బంధు పథకం ద్వారా నాడు కూలీలుగా పని చేసిన వారు నేడు ఓనర్లుగా మారారన్నారు.
ఈ 29న తిరుమలగిరిలో జరిగే సీఎం కేసీఆర్ సభకు ప్రతి మండలం నుంచి సుమారు 5 వేల పై చిలుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యేలా బాధ్యతగా పని చేయాలన్నారు. నవంబర్ 9న మండల కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయ మాటలు ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేంధర్‌రావు, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రజాక్, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ చెరుకు సుజనాపరమేశ్, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేశ్‌గౌడ్, మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, దొంగరి శ్రీను, గోపగాని శ్రీను, మల్లెపాక వెంక్న, తడకమళ్ల రవికుమార్, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల బూత్ స్థాయి ఇన్చార్జీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.