తుంగతుర్తి : భారతదేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని పలువురు వక్తలు అన్నారు. స్వతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅని దేశ చరిత్రలో 30 సంవత్సరాలు వివిధ శాఖలలో కేంద్ర మంత్రిగాపనిచేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.
నేటితరం యువత మహనీయుని ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, తడకమళ్ళ రవికుమార్, గోపగాని రమేష్, గొప్పగాని శ్రీనివాస్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, తడకమళ్ళ మల్లికార్జున్, పోలేపాక రాజేష్, గోపగాని వెంకన్న, మల్లెపాక ప్రదీప్, కడియం గోపి, గడ్డం నితిన్ తదితరులు పాల్గొన్నారు.