కోదాడ నమస్తే తెలంగాణ : రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని యువతను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన కోదాడలో విలేకరులతో మాట్లాడుతూ.. హుజూర్నగర్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళ నిజమైన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను యువతకు అందించడం విమర్శించారు.
ప్రచార ఆర్భాటమే కానీ యువతకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించటం తప్ప యువతకు వరగబెట్టింది ఏమీ లేదన్నారు. యువతకు కావాల్సింది అబద్ధాల మేళాలు కాదని నిజమైన అవకాశాలన్నారు. యువత వాస్తవాలను గమనించి రానున్న రోజుల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.