మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్లలో మెగా పల్లె ప్రకృతివనం పనులు ప్రారంభించి మొక్కలు నాటి సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాణ వాయువును పెంచడానికి హరితహారంలో భాగంగా కోట్ల మొక్కలు నాటామన్నారు.
దానితో పాటుగా ప్రతీ గ్రామంలో ఒక పల్లె ప్రకృతివనం, మండలానికి ఒకటి మెగా పల్లె ప్రకృతి వనాన్ని పది ఎకరాల స్థలంలో రూ.45లక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రతీ గ్రామం నందనవనంగా మారుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతివనాలు ప్రశాంతతకు నిలయాలుగా మారయన్నారు. గ్రామస్తులంతా తమ ఇండ్లలో కూడ అన్ని రకాల మొక్కలను పెంచుకొని ప్రాణవాయువును తయారు చేసుకోవాలని సూచించారు.
అనంతరం మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్య క్షుడు ఎస్ఏ రజాక్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఏవో రామారావునాయక్, ఏడీఏలు జగ్గునాయక్, వాసు, ఏవో వెంక టేశ్వర్లు, సర్పంచ్ దామెర్ల వెంకన్న, ఎంపీటీసీ శిరంశెట్టి వెంకన్న, వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, సూరినేని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.