శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 17, 2021 , 02:54:27

‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్‌ పుణ్యమే

 ‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్‌ పుణ్యమే

  • టీఆర్‌ఎస్‌ గిరిజన నాయకుడు రాంచందర్‌నాయక్‌ 

పాలకవీడు, జనవరి 16 : మఠంపల్లి మండలం గుర్రంబోడులోని 540సర్వే నెంబర్‌లో గల భూ వివాదాలు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుణ్యమేనని టీఆర్‌ఎస్‌ గిరిజన నాయకుడు రమావత్‌ రాంచందర్‌ నాయక్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తమ్‌ మంత్రిగా ఉన్న సమయంలోనే బినామీలతో ఆక్రమణలు చేశారని ఆరోపించారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకే ప్రస్తుతం బీజేపీతో కలిసి టీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే కాంగ్రెస్‌, బీజేపీకి నియోజకవర్గంలోని గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌ మండలాధ్యక్షుడు రమావత్‌ అశోక్‌నాయక్‌, నాయకులు బండావత్‌ రామారావు, భూక్యా రవినాయక్‌, కృష్ణానాయక్‌, సుమన్‌నాయక్‌, బాణావత్‌ విజయ, శంకర్‌నాయక్‌, నరీనాయక్‌, నాగేశ్వర్‌రావు, గోపాల్‌, పీక్యానాయక్‌, రాజశేఖర్‌  పాల్గొన్నారు. 


VIDEOS

logo