ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Nov 11, 2020 , 02:30:11

ధాన్యాన్ని ఎండబెట్టుకొని తీసుకురావాలి

 ధాన్యాన్ని ఎండబెట్టుకొని తీసుకురావాలి

  •  సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చివ్వెంల : ధాన్యాన్ని ఎండబెట్టుకొని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. మున్సిపాల్టీ పరిధిలోని కుడకుడ, దురాజ్‌పల్లిలో చివ్వెంల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను డీఆర్‌డీఓ ఎస్‌.కిరణ్‌కుమార్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి కోసిన వెం టనే మిల్లులకు తరలించొద్దని ఆరబెట్టి  తీసు కెళ్లాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్య లు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు వేములకొండ పద్మ, జాటోతు లక్ష్మి, ఏఈఓ పవన్‌, పార్వతి పాల్గొన్నారు.