శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Oct 30, 2020 , 02:25:34

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

మాడ్గులపల్లి : వానకాలం ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించకుం డా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మండలంలోని గోపాలపురంలో నిడమనూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ రామచందర్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంజయ్య, నాయకులు సర్నాల నాగరాజు, పగిళ్ల సైదులు, చింతరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బొమ్మకల్లులో ..

శెట్టిపాలెం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జడ్పీటీసీ సభ్యుడు పుల్లెంల సైదులు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు మోసిన్‌ అలీ, సర్పంచ్‌ మారుతి వెంకట్‌రెడ్డి, శెట్టిపాలెం పీఏసీఎస్‌ చైర్మన్‌ నక్క శేఖర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మౌలాలీ, సీఈఓ సైదులు, నాయకులు సూదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ తేరా కూతురుకు నోముల ఆశీర్వాదం

హాలియా : ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రెండో కుమార్తె రవళి వివాహం హైదరాబాద్‌కు చెందిన కొవ్వూరు విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు వెంకట్‌సాయిరెడ్డితో గురువారం  హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌లో జరిగింది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సతీసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.