మంగళవారం 20 అక్టోబర్ 2020
Suryapet - Oct 02, 2020 , 01:42:12

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం

  • రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ 
  •  నకిరేకల్‌, భీమారం ఉన్నత పాఠశాలల్లో జిమ్‌ సెంటర్లు  ప్రారంభం 

కట్టంగూర్‌(నకిరేకల్‌)/కేతేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

గురువారం నకిరేకల్‌ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో సొంత నిధులు రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన జిమ్‌ సెంటర్‌, సైన్స్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి పంపిణీ చేశారు. అలాగే కేతేపల్లి మండలం భీమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన జిమ్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఎంపీ బడుగుల ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నెమ్మాది బాలకృష్ణ ఎంపీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, కేతేపల్లి మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చిముట వెంకన్నయాదవ్‌, సర్పంచ్‌ బడుగుల శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీటీసీ బడుగుల రవీందర్‌యాదవ్‌, పాఠశాల హెచ్‌ఎం శైలజ, ఉపసర్పంచ్‌ స్వప్న, విద్యాకమిటీ చైర్మన్‌ పజ్జూరి విష్ణు, నానయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్‌, ముత్తిలింగం, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.  logo