నల్లగొండ/సూర్యాపేట అర్బన్/భువనగిరి కలెక్టరేట్, మార్చి 4 : ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 58,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని, ఒకవేళ ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తొలిరోజు బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులు లాంగ్వేజెస్ పరీక్ష రాయనున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
పరీక్షల కోసం జిల్లాలో 52 సెంటర్లను ఏర్పాటు చేయగా 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్షల కోసం జిల్లాలో 32 సెంటర్లను ఏర్పాటు చేయగా ఇందులో 12 ప్రభుత్వ, 20 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 16,948 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల కోసం 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 850 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
పరీక్షల కోసం జిల్లాలో 29 సెంటర్లను ఏర్పాటు చేయగా 12,558 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఎగ్జామ్ నిర్వహణకు 29 చీఫ్ సూపరింటెండెంట్లు, 29 శాఖల అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్స్ను నియమించారు.