జీవిత బీమా ఎందుకు తీసుకోవాలి? టర్మ్ పాలసీ ప్రీమియం ఎలా సెట్ చేసుకోవాలి?
Life Insurance | చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు.
Life Insurance | దివాకరం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. నెల జీతం రూ.40వేలు. భార్య చిరుద్యోగి. ఆమె జీతం నెలకు రూ.20వేలు. చింతల్లేని కుటుంబం. వచ్చినదాంతో ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం దివాకరం ఓ పాలసీ తీసుకున్నాడు. దాని విలువ రూ.నాలుగు లక్షలు. ఇరవై ఏండ్లకు ఏడాదికి సుమారు రూ.10,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఇప్పటివరకు ఆల్ హ్యాపీస్. అయితే, ఓ ప్రమాదంలో దివాకరం కన్నుమూశాడు. ఓ నెల రోజుల్లో బీమా మొత్తం నాలుగు లక్షలు అతని భార్యకు చేరింది. అది దివాకరం ఏడాది సంపాదన కన్నా తక్కువ! తర్వాత ఆ కుటుంబం బతికేది ఎలా?
ఈప్రశ్నకు సమాధానమే జీవిత బీమా. ‘కీడెంచి మేలెంచు’ అంటారు పెద్దలు. ఈ సూత్రం అంతటా వర్తించకపోవచ్చు కానీ, జీవిత బీమా విషయంలో నూటికి నూరుపాళ్లూ నప్పుతుంది. ‘మనం దూరమైతే?!’ సగటు మనిషిని ఈ ప్రశ్న నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఉద్యోగార్జితంపైనే ఆధారపడిన వ్యక్తికి అందుబాటులో ఉన్న ఏకైక సమాధానం ‘జీవిత బీమా’! అదే దివాకరం రూ.50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకొని ఉంటే.. ఆ కుటుంబానికి పాతికేండ్ల రక్షణ కల్పించి ఉండేవాడు.
చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు. అది ఒకరకంగా పెట్టుబడే అవుతుంది. ఆరోగ్య బీమా తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది జీవిత బీమా. ఒక పాలసీ తీసుకొని, ఓ ఇరవై ఏండ్లు ప్రీమియమ్‌లు కట్టి.. మరో ఐదేండ్లకు మెచ్యూరిటీ మొత్తం చేతిలో పడగానే ఏదో సాధించిన అనుభూతి కలుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి అనుభూతికి లోనవడం సబబుగానే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊహించని కష్టం ఎదురైనప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏమిటి? అనిపిస్తుంది.
కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది జరిగితే, రెండు రకాల నష్టాలు కలుగుతాయి. మొదటిది అన్నీతానే అనుకున్న వ్యక్తి దూరం కావడం. ఆ లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. ఎందరు సానుభూతి వ్యక్తం చేసినా పోయిన మనిషి ఎప్పటికీ తిరిగిరాడు. రెండో నష్టం ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోయే ప్రమాదం ఉంది. జీవిత బీమా తోడుగా ఉంటే ఆర్థికపరమైన నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. కానీ, చాలామంది ‘మనం పోతేగానీ రాని డబ్బులు ఎందుకు?’ అని భావిస్తుంటారు. టర్మ్ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడరు! అదే వ్యక్తి కొత్త కారు కొనగానే ఇన్స్యూరెన్స్ చేయిస్తాడు. కారుకు ఏ ప్రమాదం జరగకూడదని కోరుకుంటూనే ప్రతీ సంవత్సరం టంచనుగా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్నాం కదా అని, ఏ ప్రమాదం జరగకుంటే కారు ఇన్స్యూరెన్స్ డబ్బులు వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. అలాగని ప్రీమియం కట్టకుండా వదిలేయలేం కదా! జీవిత బీమా కూడా అంతే!!
ఒక సగటు ఉద్యోగి తన జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగాలంటే రెండు బీమాలు తప్పనిసరి. మొదటిది ఆరోగ్య బీమా అయితే, రెండోది జీవిత బీమా. ఈ రెండూ తీసుకున్న తర్వాతే ఆదాయ వనరులను బట్టి ఇతర పాలసీలు ఎంచుకోవాలి. ఆస్తులు కూడబెట్టుకోవాలి. ఈ ఒక్క బీమా మనతో జీవితం పంచుకున్న భాగస్వామికి, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరికీ అండగా ఉంటుంది. పిల్లల చదువుల కోసం, పెండ్లి కోసం, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితం కోసం రకరకాల పాలసీలు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదే అయినా, కుటుంబానికి అండగా ఉండే జీవిత బీమా తర్వాతే మరేదైనా అన్న విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.

పక్కాగా ప్రీమియం
జీవిత బీమా ఇవ్వడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వ్యక్తి ఆరోగ్యం, ఆదాయం, వయసు ఆధారంగా పాలసీ ఇస్తారు. ఉదాహరణకు 30 ఏండ్ల వ్యక్తి, నెలకు రూ.40 వేలు సంపాదిస్తుంటే రూ.50 లక్షల టర్మ్ పాలసీకి ఏడాదికి ప్రీమియం రూ.9,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. అంటే నెలకు రమారమి రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తికి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా.. వాటి ఆధారంగా ఈ ప్రీమియం మొత్తం పెరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ప్రీమియం మరింత ప్రియం అవుతుంది. ఐఆర్డీఏ షరతులకు లోబడి దాదాపు అన్ని ఇన్స్యూరెన్స్ సంస్థలు టర్మ్ పాలసీని ఆఫర్ చేస్తున్నాయి. మేలైన వాటిని ఎన్నుకొని వెంటనే బీమా తీసుకోండి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in
Read More :
“Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

