Health Insurance Claims | రెండు హెల్త్ బీమాపాలసీలు ఉంటే.. క్లయిమ్ ఇలా?!
Health Insurance Claims | ప్రతి ఖర్చూ పెరిగిపోవడంతో రెండు హెల్త్ బీమా పాలసీలు ఉంటే క్లయిమ్ దాఖలుపై అవగాహన అవసరమని చెబుతున్నారు.
Health Insurance Claims | ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవితం.. పూర్తిగా జీవనశైలిలో మార్పులు.. ఫలితంగా ముసురుకొస్తున్న వ్యాధులు.. ఆపై కరోనా వంటి మహమ్మారుల దాడితో ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీలకు ఇటీవల ప్రాధాన్యం పెరిగిపోయింది. అత్యధికులు అదనపు రక్షణ కోరుకుంటూ ఒకటికి మించి హెల్త్ బీమా పాలసీలు తీసుకుంటున్నారు. తడిసిమోపెడవుతున్న హెల్త్ ఖర్చులు తట్టుకోవడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అవసరం అవుతున్నాయి. ఒకటికంటే ఎక్కువ హెల్త్ బీమా పాలసీలు ఉండి.. క్లయిమ్లు దాఖలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
అనారోగ్యం వేళ అండగా హెల్త్ బీమా
అనారోగ్యానికి తోడు ఆర్థికంగా కష్టం తలెత్తకుండా హెల్త్ బీమా పాలసీ అండగా ఉంటుంది. అత్యాధునిక చికిత్సాపద్దతులు, ఇతర కారణాలతో వైద్య ఫీజులు, ఖర్చులు పెరిగిపోయాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా హెల్త్ బీమా పాలసీ మొత్తం, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు పెంచుకోవాల్సి ఉందంటున్నారు నిపుణులు. అదే టైంలో అవసరమైనప్పుడు పరిహారం పొందడానికి అనుసరించాల్సిన మార్గాలు, అవసరమైన పత్రాలు, ఇంటి వద్ద చికిత్సకు క్లయిమ్ చేసుకోవాల్సిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
ఉద్యోగులు ఇలా రెండు హెల్త్ బీమా పాలసీలు
ఇప్పుడు పలువురు ఉద్యోగులు రెండు హెల్త్ పాలసీలు తీసుకుంటున్నారు. వివిధ సంస్థల యాజమాన్యాలు ఇచ్చే గ్రూప్ పాలసీలతోపాటు సిబ్బంది వ్యక్తిగతంగా కుటుంబం మొత్తానికి వర్తించేలా మరో బీమా పాలసీ తీసుకుంటున్నారు. కొంత మంది సొంతంగా రెండు వేర్వేరు హెల్త్ బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో పాలసీ నెట్వర్క్ గల హాస్పిటల్లో చేరి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందడానికి వీలు చిక్కుతుంది. అటువంటప్పుడు ఒక హెల్త్ బీమా పాలసీ ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ, చికిత్స ఖర్చు.. సంబంధిత హెల్త్ బీమా పాలసీ మొత్తాన్ని మించిపోతే.. రెండో బీమా సంస్థ ఇచ్చిన హెల్త్ బీమా పాలసీతో అదనపు క్లయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు దవాఖాన నుంచి బిల్లులన్నీ తీసుకోవాలి. హాస్పిటల్లో చేరినప్పుడు క్లయిమ్ చేసిన హెల్త్ బీమా పాలసీ సంస్థ ఇచ్చిన పరిహారం వివరాలు జత చేయాల్సి ఉంటుంది.
ఒకే దవాఖాన.. రెండు పాలసీలతో ఇలా
ఒకే హాస్పిటల్.. మీరు హెల్త్ బీమా పాలసీ తీసుకున్న రెండు హెల్త్ బీమా సంస్థల నెట్వర్క్ దవాఖానల్లో చేరి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ సంస్థలను సంప్రదించి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందడానికి పర్మిట్ చేస్తారా.. రీయింబర్స్మెంట్ చేసుకునేందుకు అనుమతిస్తారా.. అనే సంగతి తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ ఖర్చు పెరిగిపోతుందని భావిస్తేనే రెండు హెల్త్ బీమా పాలసీలు ఉన్నాయన్న సంగతి ముందే దవాఖానకు తెలపండి.
నెట్వర్క్లో లేని దవాఖానలో చేరితే ఏం చేయాలంటే..
అలా కాకుండా రెండు హెల్త్ బీమా సంస్థల నెట్వర్క్లో లేని దవాఖానాలో చేరారనే అనుకుందాం.. పాలసీదారు దవాఖాన బిల్లు చెల్లించి తర్వాత పరిహారం కోసం హెల్త్ బీమా సంస్థలను సంప్రదించాలి. ఇటువంటి టైంలో క్లయిమ్ ఫామ్ పూర్తి చేసి, దానికి ప్రతి బిల్లూ జత చేయాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల రిపోర్ట్లు, ఎక్స్రేలు తదితర డిటైల్స్ సబ్మిట్ చేయాలి. ఎంత మొత్తానికి క్లయిమ్ చేయాలో ముందే నిర్ధారించుకోవాలి. రెండు హెల్త్ బీమా పాలసీల్లో ఎక్కువ మొత్తం అందించే పాలసీ నుంచి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఒక హెల్త్ బీమా పాలసీ పూర్తిగా వాడుకున్నాకే ఎక్కువ మొత్తాన్ని రెండో హెల్త్ బీమా సంస్థ నుంచి పొందొచ్చు. దీనికోసం దవాఖాన అడ్మినిస్ట్రేషన్ అటెస్టేషన్ చేయించుకోవాలి. తొలి బీమా సంస్థ క్లయిమ్ వివరాలన్నీ జత చేస్తే గానీ రెండో బీమా అదనంగా అయిన అధిక మొత్తం చెల్లిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Claim
- Health Insurance
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

