– కార్పొరేటర్ మునిగడప పద్మ
రుద్రంపూర్, మే 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం మొదటి విడత డ్వాక్రా గ్రూప్ మహిళలకే అనడం సరికాదని, 18 నుండి 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇచ్చేవారిని అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని మహిళలందరూ డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. చీరలు విడతల వారిగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. సీఓ ఉపేందర్, ఆర్పీ కవిత, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.