Harmanpreet Kaur : భారత మహిళల జట్టుకు తొలి వరల్డ్‌కప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాన్ని స్వీకరించింది. రాష్ట్రపతి భవన్లో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా హర్మన్‌ప్రీత్ పద్మ శ్రీ(Padma Shri) అవార్డును అందుకుంది. టీమిండియా కలను సాకారం చేసి.. మహిళా క్రికెట్ వికాసానికి తోడ్పడిన ఆమెను ఈ సందర్భంగా ముర్ము అభినందించారు. పద్మ శ్రీకి ఎంపికైన రోహిత్ శర్మ మాత్రం అవార్డు వేడుకలో కనిపించలేదు.
నిరుడు సొంతగడ్డపై భారత జట్టుకు వన్డే ప్రపంచకప్ కట్టబెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియాను విశ్వవిజేతగా నిలిపింది. దిగ్గజ కెప్టెన్లు డయానా ఎడుల్జి, శాంత రామస్వామి, అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్ వంటి వాళ్లకు సాధ్యమవ్వని ఘనతను సొంతం చేసుకున్న కౌర్‌ను భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది.
President Droupadi Murmu confers #PadmaShri upon captain of the Indian women’s cricket team Harmanpreet Kaur Bhullar
One of the most dynamic and impactful cricketers of her generation, she led India to its historic first Women’s Cricket World Cup title #PeoplesPadma… pic.twitter.com/Iuzu9326fh
— PIB India (@PIB_India) May 25, 2026
రాష్ట్రపతి భవన్లో సోమవారం సంప్రదాయ దుస్తుల్లో హాజరైన హర్మన్‌ప్రీత్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డును అందుకుంది. నవంబర్ 2న జరిగిన పైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు తొలిసారి జగజ్జేతగా అవతరించింది.
పద్మ అందుకున్న ఇతర క్రీడాకారులు
విజయ్ అమృత్‌రాజ్(టెన్నిస్) – పద్మ భూషణ్
హర్మన్‌ప్రీత్ కౌర్(క్రికెట్) – పద్మ శ్రీ
బల్దేవ్ సింగ్ (హాకీ కోచ్) – పద్మ శ్రీ
భగవాన్‌దాస్ రైక్వర్(రెజ్లింగ్) – పద్మ శ్రీ
కె.పజనివెల్(తమిళ మార్షల్ ఆర్ట్స్ సిలంబం) – పద్మ శ్రీ
ప్రవీణ్ కుమార్(పారా హై జంపర్) – పద్మ శ్రీ
రోహిత్ శర్మ(క్రికెట్) – పద్మ శ్రీ
సవితా పూనియా(రెజ్లింగ్) – పద్మ శ్రీ