Right Health Insurance | బెస్ట్ హెల్త్ బీమా పాలసీ ఎంపికకు పంచ సూత్రాలు!
Right Health Insurance | సరైన హెల్త్ బీమా పాలసీని ఎంచుకోవడానికి ఐదు సూత్రాలు పాటించాలని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు.
Right Health Insurance | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నారు. వృద్ధులు మాత్రమే కాదు యువతలోనూ ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, అనారోగ్యం కనిపిస్తున్నది. వైద్య ఫీజులు, ఔషధాల ధరలు, చికిత్స ఖరీదు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా సరైన ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవడం ముఖ్యం. మీరు సరైన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకుందామా.. !
భారత్‌లో మీరు మీ కుటుంబానికి సరైన ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవడానికి ఐదు సూత్రాలు
ఆరోగ్య బీమా కంపెనీ ఆఫర్ చేస్తున్న కవరేజీ ఎంత మొత్తం అన్నది చాలా ముఖ్యం. ఆరోగ్య బీమా పాలసీ కవరేజీలో భాగంగా వైద్య ఖర్చులు చేరుస్తున్నారా? అన్న విషయం తెలుసుకోవాలి. ఉదాహరణకు హాస్పిటలైజేషన్ ఖర్చులు, అంబులెన్స్ చార్జీలు, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, డేకేర్ ఖర్చులు, ప్రసూతి ఖర్చులు తదితర అంశాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి చూసుకోవాలి. అధిక కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా అధికంగానే ఉంటుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మీ కుటుంబ అవసరాలకు సరైన హెల్త్ బీమా పాలసీ ఎంచుకోవాలి.
తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీ ఎంచుకోవాలి
వివిధ హెల్త్ బీమా పాలసీల కవరేజీకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆరోగ్య బీమా సంస్థల్లో వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉంటుంది. కొన్ని సంస్థలు కొద్ది కాలం వెయిటింగ్ పీరియడ్ ఆఫర్ చేస్తే, మరికొన్ని ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ నిబంధన పెడతాయి. ముందస్తు అనారోగ్య సమస్యలకు కవరేజీ లభిస్తుందా అన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సంస్థలు ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తేదీ నుంచి ప్రసూతి ఖర్చుల కవరేజీకి 2-4 ఏండ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కనుక తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం.
వ్యక్తిగతం కంటే కుటుంబ ఫ్లోటర్‌తో ఎక్కువ బెనిఫిట్లు
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఫ్యామిలీ ప్లోటర్ ప్లాన్ తీసుకుంటే చాలా చౌకగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా హెల్త్ బీమా తీసుకుంటే ఖర్చు పెరిగిపోతుంది. సాధారణంగా కుటుంబ సభ్యులంతా ఒకేసారి అనారోగ్యానికి గురి కారు. కానీ, కుటుంబ సభ్యులందరి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం మంచిది. కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల చౌకగా గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయి.
పాలసీ పునరుద్ధరణ ప్లాన్‌పై ఇలా
ఏ నూతన ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నా తొలిసారి అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత చరమాంకంలో హెల్త్ బీమా పాలసీ అవసరం అవుతుంది. సంబంధిత ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. టెన్యూర్ టైం లోపు హెల్త్ బీమా పాలసీని పునరుద్ధరించుకోవడం మంచిది. అలా కాకుండా చివరి క్షణం వరకు వేచి ఉండకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఒక చాయిస్ కాదు.. తప్పనిసరి అవసరం. అధిక క్లయిమ్‌లు సెటిల్మెంట్ చేసిన బీమా సంస్థ ఆధ్వర్యంలోని ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

