Brain Multitasking | సైకిల్ నేర్చుకోవడం వరకే కష్టం. కానీ ఆ తర్వాత అసంకల్పింతంగా మనం ఆ రెండు చక్రాల బండిని నడిపించేయగలం. మన మెదడుకు తెలిసిన అరుదైన విద్యలలో ఈ ‘మల్టీ టాస్కింగ్’ ఒకటి. ఇదే విషయం మీద మరింత లోతైన అధ్యయనం చేయాలనుకున్నారు రొచెష్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. దీనికోసం కొంతమంది అభ్యర్థులను ల్యాబ్‌లోని ట్రెడ్మిల్ మీద నడిపించారు. ఆ సమయంలో వారి అణువంత కదలికను సైతం పసిగట్టే 16 కెమెరాలను నిలిపారు. వాళ్ల మెదడులో ఏం జరుగుతోందో తెలుసుకునే సెన్సర్లను అమర్చారు. విచిత్రంగా ఏ ఆలోచనా లేకుండా అడుగులు వేస్తున్నప్పటికంటే… మెదడుకు పనిపెట్టే ఆలోచన చేస్తూ నడుస్తున్నప్పుడు, వారి నడక మరింత స్థిరంగా కనిపించిందట. ఈ సమయంలో మెదడులో జరిగిన పరిణామాలన్నిటినీ నిశితంగా నమోదు చేశామనీ, వాటిని విశ్లేషించడం ద్వారా ఆల్జీమర్స్ ( Alzheimer’s )లాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరికిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
పరిశోధకులు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
మంచినిద్రతో అల్జీమర్స్‌కు చెక్”
Memory Power | ఇలా చేస్తే చదివింది ఇట్టే గుర్తుండిపోతుంది”
నిద్రపోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు
రోజూ ఉదయం ఎండలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా?